![]() |
![]() |
.webp)
బుల్లితెర మీద అశ్విని శ్రీ అందరికీ తెలుసు. బిగ్ బాస్ ద్వారా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది ఈ సొట్ట బుగ్గల చిన్నారి. మూవీస్ లో చిన్న చిన్న రోల్స్ లో నటించింది. బిగ్ బాస్ 7 కి వైల్డ్ కార్డు ద్వారా వెళ్ళింది. అలాగే ఎన్నో టీవీ ప్రోగ్రామ్స్ లో కనిపించింది. ఐతే కొంతకాలం ఈమె బుల్లితెర మీద కనిపించడమే లేదు. ఇక ఇప్పుడు ఒక ఎమోషనల్ వీడియోతో అందరి ముందుకు వచ్చింది. "నేను నా సోను బాయ్‌ని కోల్పోయాను.ఆ బాధను భరించలేకపోతున్నాను.
దానికి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యింది. కానీ ఎటువంటి లక్షణాలు కనిపించలేదు. దయచేసి, మీరు కుక్కను పెంచుకుంటూ ఉంటే గనక క్రమం తప్పక ఆరోగ్య పరీక్షలను చేయించండి. నిర్లక్ష్యం చేయకండి. దానికి ఏదైనా సమస్య ఉన్నప్పుడు అవి మనకు చెప్పలేవు కదా. బయటకు నార్మల్ గా కనిపించినా లోపల చాలా బాధను అనుభవిస్తూ ఉంటాయి.
ముందస్తు పరీక్షలు చేయిస్తే వాటి ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఇంకో అవకాశం ఉండి ఉంటె ఏదైనా చేసేదాన్ని. అవి చేజారిపోయేవరకు లేట్ చేయకండి " అంటూ అశ్వినిశ్రీ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. పెట్టడమే కాదు ఆ వీడియోలో ఏడుస్తూ కనిపించింది. ఆ శునకం సోనుకు అంత్యక్రియలు చేసిన వీడియోని కూడా పోస్ట్ చేసింది
![]() |
![]() |